అమరావతిముచ్చట్లు:
IRCTC ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు’ ద్వారా ప్రత్యేక జ్యోతిర్లింగ యాత్రను ప్రకటించింది. ఈ యాత్ర ఏప్రిల్ 27న గోరఖ్పూర్ నుంచి ప్రారంభమై మే 8వ తేదీన ముగుస్తుంది. 11 రాత్రులు, 12 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, త్రయంబకేశ్వర్, ఘృష్టేశ్వర్, భీమశంకర్, నాగేశ్వర్ వంటి 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవచ్చు. భోజనం, వసతి, స్థానిక సందర్శన ఖర్చులన్నీ ఈ ప్యాకేజీలోకే వస్తాయి.
Tags: Jyotirlinga Yatra from April 27th