బి.కొత్తకోట ముచ్చట్లు:
బి.కొత్తకోట నుండి చలిమామిడికి ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు సోమవారం ప్రమాదానికి గురై బోల్తా పడింది. బి.కొత్తకోట పంచాయతీకి చెందిన ట్రాక్టర్ అచ్చమ్మ కోన వైపు వెళ్తుండగా, దానిని ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సు నియంత్రణ తప్పి పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా ఓవర్‌టేక్ చేయడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: B. RTC bus overturns in Kothakota: Accident while overtaking