అమరావతిముచ్చట్లు:
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఉద్యోగుల గత ప్రభుత్వ బకాయిల చెల్లింపులపై కసరత్తుకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిధుల లభ్యత ఆధారంగా ఉద్యోగులకు చెల్లింపులు చేసేలా ఆర్థికమంత్రి కసరత్తు ప్రారంభించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్ల విడుదలకు ఆర్థికశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది.
Tags: Major Relief for Government Employees in AP