అమరావతిముచ్చట్లు:
దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను భారీగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక కసరత్తు చేస్తోంది.
సుమారు 50 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపాదిత కొత్త ఫార్ములా ప్రకారం, ప్రస్తుతం 543గా ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్య 815 నుంచి 850కి చేరే అవకాశం ఉంది.
అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యే స్థానాలు 50 శాతం వరకు పెరగనున్నట్లు సమాచారం.
జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు.
Tags; Delimitation of constituencies after 50 years… number of seats set to increase!