November 26, 2026
Explore
విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు స్థల పరిశీలన చేసిన JC

విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు స్థల పరిశీలన చేసిన JC

November 26, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు:

విద్యుత్‌ సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రతిపాదించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు జాయింట్‌ కలెక్టర్‌ శివ నారాయణ శర్మ గురువారం స్థలాలను పరిశీలించారు. రాయచోటి మండలం రాయచోటి గ్రామం, కురబలకోట మండలం ముదివీడులో ప్రతిపాదిత స్థలాలను సంబంధిత తహసీల్దార్లు, ఆర్డీఓతో కలిసి పరిశీలించారు. స్థలాల అనుకూలత, భూమి విస్తీర్ణం, మౌలిక సదుపాయాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా సామర్థ్యం మెరుగుపడి ప్రజలు, రైతులకు మెరుగైన సేవలు అందనున్నాయని తెలిపారు.

Tags: JC inspects sites for electrical substations