తిరుమల ముచ్చట్లు:
46 ఆభరణాలను సమర్పించిన చెన్నైకి చెందిన వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆభరణాల సమర్పణ
తిరుమల శ్రీవారి చరిత్రలో చారిత్రాత్మక విరాళంగా నిలిచేలా చెన్నైకి చెందిన దాతలు వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ విరాళం సమర్పించారు.
శ్రీవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దాత దంపతులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి రంగనాయకుల మండపంలో ప్రదర్శించిన 46 బంగారు ఆభరణాలను వీక్షించి, దాతల ఉదారతను అభినందించారు.
అనంతరం దాత కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు తలపై ఆభరణాల పళ్లెంలను ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, శ్రీవారి సన్నిధికి చేరుకుని ఆభరణాలను స్వామివారి ఎదుట సమర్పించి పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సాధికార మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవోలు డా. శరత్, గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు. జిల్లా అధికారుల్లో కలెక్టర్ డా. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆభరణాల వివరాలు
- మొత్తం బంగారం: 121 కిలోలు (24 క్యారెట్లు)
- మొత్తం ఆభరణాలు: 46
- ఆభరణాల రకాలు: 33
- ఆభరణాల తయారీ ఖర్చులతో కలిపి మొత్తం విలువ: రూ.206 కోట్లు
- శ్రీవారి ఆభరణాలకు వినియోగించిన బంగారం: 106 కిలోలు (24 క్యారెట్లు)
- మిగిలిన 15 కిలోల బంగారంతో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రం తయారు చేయనున్నారు.
విలువైన రాళ్ల వివరాలు
- వజ్రాల మొత్తం బరువు: 238.2 క్యారెట్లు
- నీలమణులు: 2,247.7 క్యారెట్లు
- పసుపు నీలమణులు: 91.6 క్యారెట్లు
- కెంపులు, పచ్చలు 84.2 క్యారెట్లు
- సాలగ్రామ రాళ్లు : 2,916.5 గ్రాములు.
విరాళంగా సమర్పించిన 33 రకాల ఆభరణాల వివరాలు
- పాద కవచములు – 2
- అందెలు – 2
- పాగడ – 1
- తులసిపత్ర హారము – 1
- అష్టోత్తర శత కాసుల మాల – 1
- చతుర్భుజ లక్ష్మీ హారము – 1
- పులిగోరు – 1
- అష్టోత్తర పత్ర హారము – 1
- సాదా వడ్డాణము – 1
- గంటల ములత్రాడు – 1
- సూర్య కంఠి – 1
- కౌస్తుభం – 1
- శ్రీవత్సం – 1
- మొలచేయి – 1
- కటి హస్తము పై రేకు – 1
- నాగాభరణ వడ్డాణము – 1
- గొలుసు – 1
- అభయ చేతుల కంకణాలు – 5
- చంద్ర వంక కంఠి – 1
- వైకుంఠ హస్తము – 1
- కరి హస్తము – 1
- నాగాభరణ కడియములు – 2
- నాగాభరణములు – 2
- భుజకీర్తులు – 2
- కర్ణ పత్రములు – 2
- బాహువులు – 2
- శాలిగ్రామ హారము – 2 (2 భాగాలు)
- కమలం త్రపు శాలిగ్రామ హారములు – 2 (2 భాగాలు)
- నీమ కవచముల మోపుగల యజ్ఞోపవీతం – 1
- శంఖము కవచము – 1
- చక్రము కవచము – 1
- ముక్కుపుడి – 1
- కిరీటము – 1
Tags: Donation of 121 kg of gold ornaments, worth Rs 206 crore, to Srivari (Lord Venkateswara)