November 26, 2026
Explore
రాత్రి కోర్టులు వద్దంటు విధులు బహిష్కరణ

రాత్రి కోర్టులు వద్దంటు విధులు బహిష్కరణ

November 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాత్రి పూట కోర్టులు నిర్వహిస్తే న్యాయవాదులకు, ప్రజలకు తీవ్ర సమస్యలు ఎదురౌతుందని, వీటిని అమలు చేయరాదంటు న్యాయవాదులు రెండు రోజులు విధులు బహిష్కరించారు. గురువారం న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ రాత్రి పూట కోర్టులు ఏర్పాటు చేయాలన్న ఆలోచనను హైకోర్టు విరమించుకోవాలన్నారు. రాత్రి పూట కోర్టులకు ప్రత్యేక సిబ్బందిని , న్యాయమూర్తులను నియమించినా కేసులు నిర్వహించాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసిన న్యాయవాదులు తిరిగి రాత్రి సమయాల్లో కూడ కేసులు విచారించాలంటే కష్టతరమౌతుందన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు రాత్రి వరకు కోర్టుల్లో ఉంటే తిరిగి వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు సరైన బస్సు సదుపాయాలు లేవన్నారు. రాత్రి పూట కోర్టుల ఏర్పాటుతో ప్రతి ఒక్కరికి కష్టాలు ఎదురౌతుందే తప్పా సమస్యలు పరిష్కారం కాదన్నారు. ఈ ఆలోచనను తక్షణమే ఉప సంహరించుకోవాలని , రాత్రి పూట కోర్టులు ఏర్పాటు చేయవద్దని నిరశిస్తూ గురు, శుక్రవారాలలో రెండు రోజులు మూకుమ్మడిగా అన్ని కోర్టుల విధులను బహిష్కరిస్తున్నామన్నారు. ఈ విషయంలో హైకోర్టు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే న్యాయవాదులు ఆందోళనలు తీవ్రం చేస్తామని తెలిపారు.

Tags; Boycott of duties in opposition to night courts