తిరుమల ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తన సతీమణి భువనేశ్వరితో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికు టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ మరియు ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, అర్చకులు సంప్రదాయ ఇస్తికఫల్ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవోలు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జేఈవోలు డాక్టర్ ఎ. శరత్, ప్రభల గోపీనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.










Tags:Chief Minister Nara Chandrababu Naidu offered prayers to Lord Venkateswara at Tirumala