సంబేపల్లి ముచ్చట్లు:
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సంబేపల్లి మండల ప్రజలు శాంతిభద్రతలకు సహకరించాలని SI రవి కుమార్ తెలిపారు. 144 CrPC అమలులో ఉన్నందున అనుమతి లేకుండా గుంపులుగా గుమిగూడరాదు. ఓటు వేసిన వెంటనే పోలింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోవాలన్నారు. ఓటర్లను బెదిరించడం, ప్రలోభపెట్టడం, పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం, గొడవలు, దాడులు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అన్నారు. బయటి వ్యక్తులు అనవసరంగా గ్రామాల్లో ఉండరాదు. సోషల్ మీడియాలో అసత్య, రెచ్చగొట్టే పోస్టులు చేయరాదు అన్నారు. విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా, డీజేలకు అనుమతి లేదు. సమాచారం కోసం: SDPO 9121100715, CI 9121100563, SI 9121100566.
Tags: Important Instructions and Warnings from the Sambepalli Mandal Police Department