పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని గానుగలగడ్డకు చెందిన రైతు రెడ్డెప్పరెడ్డి, భారతి దంపతుల కుమారై డాక్టర్ ప్రవల్లిక ఆంధ్రయూనివర్శిటి టాపర్‌గా నిలిచింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో డాక్టర్ ప్రవల్లిక ఎండి రెస్పిరేటరీ చదివారు. 615 మార్కులతో యూనివర్శిటి టాపర్‌గా నిలిచారు. 800 మార్కులకు గాను ఆమె 615 మార్కులు సాధించింది. ఆమె విశాఖపట్నంలోని ఆంధ్రమెడికల్ కళాశలలో రెస్పిరేటరీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సునిల్‌కుమార్ పర్యవేక్షణలో ప్రవల్లిక ఎండి కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి డాక్టర్ కావాలన్న తలంపుతో , తల్లుదండ్రుల ప్రోత్సాహంతో ఆమె ఆంధ్రయూనివర్శిటి టాపర్‌గా నిలవడంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు.
Tags; Dr. Pravallika Emerges as University Topper in MD (Respiratory Medicine)