November 24, 2026
Explore
రాజంపేట మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా షబ్రీన్ నూర్ ఏకగ్రీవం

రాజంపేట మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా షబ్రీన్ నూర్ ఏకగ్రీవం

November 24, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

•పుర పీఠంపై ‘యువ రక్తం’ మరియు ‘మహిళా శక్తి’కి పెద్దపీట వేసిన తెలుగుదేశం

•మైనారిటీలకు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్

•ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారి సారథ్యంలో పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్న నూతన పాలకవర్గం

రాజంపేట టౌన్: రాజంపేట పురపాలక సంఘం వైస్ చైర్‌పర్సన్ పదవి తెలుగుదేశం పార్టీ 9వ వార్డు కౌన్సిలర్ షబ్రీన్ నూర్ ను వరించింది. మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 9వ వార్డు కౌన్సిలర్ షబ్రీన్ నూర్ ని కూటమి కౌన్సిలర్లు ఏకగ్రీవంగా వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు.

పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఈ ఎన్నిక ప్రక్రియలో రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్ వైస్ చైర్‌పర్సన్ పదవికి షబ్రీన్ నూర్ పేరును ప్రతిపాదించగా, 24వ వార్డు కౌన్సిలర్ నగిరిపాటి బాబు బలపరిచారు. అనంతరం కౌన్సిలర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో అధికారులు ఆమె ఎన్నికను అధికారికంగా ప్రకటించారు.

యువత, మహిళలు, మైనారిటీలకు పెద్దపీట:
రాజంపేట పురపాలిక పీఠంపై అత్యున్నత పదవులైన చైర్‌పర్సన్ (డాక్టర్ దొంత గాయత్రి), వైస్ చైర్‌పర్సన్ షబ్రీన్ నూర్) రెండు స్థానాల్లోనూ యువతకు, ముఖ్యంగా మహిళలకు అవకాశం కల్పించడం విశేషం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , యువనేత నారా లోకేష్ ముస్లిం మైనారిటీలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ ఈ అవకాశం కల్పించడంపై కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నిక అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు, రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు, కడప జిల్లా టీడీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ గుణపాటి దీపక్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు ఎల్లటూరి శ్రీనివాస్ రాజు తదితరులు మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసి నూతన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ మరియు కౌన్సిలర్లందరికీ పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

*చమర్తి సారథ్యంలో పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం:

అనంతరం కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత గాయత్రి, వైస్ చైర్‌పర్సన్ షబ్రీన్ నూర్ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి, ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు కి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు సారథ్యంలో, వారి విలువైన సూచనలు, సలహాలతో కౌన్సిలర్లందరినీ కలుపుకుని రాజంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, మౌలిక వసతుల కల్పనకు, సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని వారు తెలియజేశారు చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Tags; Shabreen Noor elected unanimously as Vice-Chairperson of Rajampet Municipality