November 24, 2026
Explore
రాజంపేటలో టీడీపీలో ముసలం.

రాజంపేటలో టీడీపీలో ముసలం.

November 24, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

అధిష్టానంపై తిరుగుబాటు చేసిన కౌన్సిలర్లు!

రాజంపేట మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక టీడీపీలో అంతర్గత విభేదాలకు వేదికైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించిన కౌన్సిలర్లు దొంతం శివప్రసాద్‌ను వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. వివాదాన్ని పరిష్కరించి కౌన్సిలర్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ పరిశీలకుడు ఉక్కు ప్రవీణ్ రాజంపేటకు వెళ్లారు. అయితే పరిశీలకుడి ప్రయత్నాలను కౌన్సిలర్లు వ్యతిరేకించినట్లు సమాచారం. దొంతం శివప్రసాద్‌నే వైస్ చైర్మన్‌గా కొనసాగించాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ పరిశీలకుడు ఉక్కు ప్రవీణ్‌పై దాడికి యత్నించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఆదేశాలను కౌన్సిలర్లు బేఖాతరు చేయడంతో రాజంపేట టీడీపీలో నెలకొన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

Tags; Turmoil within the TDP in Rajampet.