చిట్వేల్ ముచ్చట్లు:
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చిట్వేల్ మండలం కొత్తపల్లి ప్రచారానికి వెళ్లిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను మహిళలు నిలదీశారు.
పరిషత్ ఎన్నికల్లో జనసేన పోటీలో ఉండగా, టీడీపీకి మద్దతు పలికిన వారికి ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. “నువ్వు అసలు ఏ పార్టీ ఎమ్మెల్యేవి?” అంటూ నిలదీత. ఆ రోజు టీడీపీ పోటీలో ఉందని ప్రచారానికి రాలేదని మండిపాటు.
ఇప్పుడు మళ్లీ ఎందుకు మా గ్రామం వచ్చారంటూ మహిళలు నిలదీశారు.
గ్లాసు గుర్తుకు ప్రచారం చేయాల్సిన మీరు టీడీపీకి ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీంతో నాది తప్పేనని ఒప్పుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్.
Tags; Jana Sena activists give a tough time to Koduru MLA Arava Sridhar