అన్నమయ్య ముచ్చట్లు:
ఈ నెల 26న సంబేపల్లి 9, రామాపురం 2 పంచాయతీల్లో జరగనున్న ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, స్ట్రైకింగ్, రిజర్వ్ బలగాలను సిద్ధంగా ఉంచారు. రౌడీషీటర్లు, బైండోవర్ వ్యక్తులపై నిఘా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల 100–200 మీటర్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎన్నికలకు 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Tags; Tight security arrangements for the first phase of elections