November 24, 2026
Explore
మంచి దుప్పట్లో ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్..

మంచి దుప్పట్లో ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్..

November 24, 2026 | Andhra Pradesh

హార్సిలీ హిల్స్ ముచ్చట్లు:

ప్రకృతి అందాల మధ్య పర్యాటకుల సందడి..

చల్లని గాలులు.. కనువిందు చేసే కొండలు..

పర్యాటకులను కట్టిపడేస్తున్న హార్సిలీ అందాలు..

ప్రకృతి ఒడిలో సేదతీరాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. అలాంటి పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్. చుట్టూ పచ్చని కొండలు.. ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి అందాలు.. చల్లని వాతావరణం.. పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. జిల్లాలోని ఏకైక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన హార్సిలీ హిల్స్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

మంచు దుప్పటి కప్పుకున్న కొండలు.. కనుచూపు మేర విస్తరించిన పచ్చని ప్రకృతి.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇవన్నీ ఒకేచోట కనిపించే అద్భుత ప్రదేశమే హార్సిలీ హిల్స్.
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట సమీపంలో సముద్రమట్టానికి సుమారు 1,290 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొండల మధ్య నుంచి వీచే చల్లని గాలులు, ఉదయం వేళల్లో కనిపించే మంచు అందాలు, ప్రకృతి ఒడిలో గడిపే ఆహ్లాదకరమైన క్షణాలు పర్యాటకులకు మధురానుభూతిని అందిస్తున్నాయి.
కుటుంబ సభ్యులతో కలిసి విహరించేందుకు, స్నేహితులతో సరదాగా గడిపేందుకు, ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించేందుకు పర్యాటకులు హార్సిలీ హిల్స్‌కు క్యూ కడుతున్నారు.
ఎత్తైన కొండలు, లోయలు, పచ్చని చెట్లు, సుందరమైన వ్యూ పాయింట్లు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రకృతి అందాలు పర్యాటకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి.

కేవలం అన్నమయ్య జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. వారాంతాలు, సెలవు దినాల్లో పర్యాటకుల సందడి మరింత పెరుగుతోంది.
అయితే ఇంతటి ప్రకృతి సంపద కలిగిన హార్సిలీ హిల్స్‌ను మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, రవాణా, భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Tags; Horsley Hills, a prominent tourist destination, is wrapped in a fine blanket of mist.