November 24, 2026
Explore
కార్తీక పౌర్ణమి.. ఉమామహేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కార్తీక పౌర్ణమి.. ఉమామహేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

November 24, 2026 | Andhra Pradesh

తెల్లవారుజాము నుంచే జాతీయ రహదారిపై భక్తుల బారులు.. కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు

రాయచోటి ముచ్చట్లు:

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శివనంది సర్కిల్ వద్ద వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలతో పాటు జాతీయ రహదారిపై భక్తులు బారులు తీరారు.ఈ సందర్భంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు నటరాజ స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్తీక పౌర్ణమి విశిష్టతను, ఈ పర్వదినం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను భక్తులకు వివరించారు.ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అరమాటి శివగంగి రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు కల్పించారు. అదేవిధంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామి ఆలయం భక్తుల శివనామస్మరణతో మారుమోగింది.

Tags; Karthika Pournami: Devotees flock to the Uma Maheswara Swamy temple