November 23, 2026
Explore
కెనడా లాటరీలో కేరళ మహిళకు రూ.32 కోట్ల జాక్పాట్..

కెనడా లాటరీలో కేరళ మహిళకు రూ.32 కోట్ల జాక్పాట్..

November 23, 2026 | Andhra Pradesh

కెనడా ముచ్చట్లు:

కెనడాలోని ఎడ్మంటన్లో అక్టోబర్ 21న జరిగిన ‘లాటో 6/49 క్లాసిక్’ డ్రాలో కేరళకు చెందిన స్నేహా జాయ్ అనే మహిళ 5 మిలియన్ కెనడియన్ డాలర్ల (సుమారు రూ.32 కోట్లు) భారీ జాక్పాట్ గెలుచుకున్నారు.

వెస్ట్రన్ కెనడా లాటరీ కార్పొరేషన్ ఈ విజయాన్ని ధ్రువీకరించింది.

ఈ డబ్బులతో తన ఇంటి రుణాలను తీర్చి, కుటుంబంతో కలిసి ప్రపంచ యాత్ర చేయాలని స్నేహా భావిస్తున్నారు.

ఎర్నాకులం జిల్లాకు చెందిన ఆమె, ఐదేళ్ల క్రితం భర్తతో కలిసి కెనడాకు వలస వెళ్లారు.

ఈ అదృష్టం ఆమె జీవితాన్ని ఆర్థికంగా స్థిరీకరించింది.

Tags: Kerala woman wins Rs 32 crore jackpot in Canadian lottery..