November 23, 2026
Explore
రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?

రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?

November 23, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాట కొత్త సంస్థతో మొదలైన చర్చ!* దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచారు.అయితే ఈసారి ఆమె సినిమాల గురించి కాకుండా, రాజకీయ అరంగేట్రంపై తమిళనాట జోరుగా చర్చ జరుగుతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జె. జయలలితకు ఉన్న ప్రఖ్యాత బిరుదును స్ఫూర్తిగా తీసుకుని తమిళనాడులో త్రిష అభిమానులు ఆమె పేరుతో ఒక ప్రత్యేక సంస్థను ప్రారంభించడమే ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది.

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో త్రిష మద్దతుదారులు ‘ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై’ పేరుతో కొత్త సంస్థను ప్రారంభించారు. దివంగత సీఎం జయలలితను అభిమానులు ఎంతో ప్రేమతో ‘పురట్చి తలైవి’ (విప్లవ నాయకి) అని పిలుచుకునేవారు. ఇప్పుడు ఆ బిరుదుకు ‘ఇళయ’ (యువ) అనే పదాన్ని జోడించి త్రిషకు ఆపాదించడం తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తిరునెల్వేలిలో ఈ వేదికను ప్రారంభించిన సమన్వయకర్త రాజగోపాల్ మాట్లాడుతూ.. త్రిష త్వరలోనే రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి త్రిష రాజకీయాల్లో అడుగుపెడితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, జయలలిత తరహా పాలన అందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సంస్థ ఏర్పాటుపై గానీ, రాజకీయ ప్రవేశంపై గానీ త్రిష ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలు ఈ సంస్థకు ఆమె అనుమతి ఉందా లేదా అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉందిగత కొంతకాలంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, త్రిషల మధ్య ఉన్న సాన్నిహిత్యంపై సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ చాలా ఏళ్లుగా మంచి స్నేహితులమని గతంలోనే వెల్లడించారు. 2026 మే నెలలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి త్రిష హాజరై, ఆయన తల్లిదండ్రులను పలకరించడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. పలు బహిరంగ కార్యక్రమాల్లోనూ వీరిద్దరూ కలిసి కనిపించడంతో త్రిష రాజకీయ ఎంట్రీ వార్తలకు మరింత బలం చేకూరింది.

1999లో వచ్చిన తమిళ చిత్రం ‘జోడి’లో చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమైన త్రిష, 2002లో సూర్య సరసన నటించిన ‘మౌనం పేసియాదే’తో హీరోయిన్‌గా మారారు. ఆ తర్వాత ‘సామి’, ‘గిల్లీ’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 27 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో ‘విన్నైతాండి వరువాయా’, ’96’, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ 1 & 2’, విజయ్ ‘లియో’ (2023), కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ (2025) వంటి భారీ చిత్రాల్లో నటించారు. చివరిగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య సరసన ‘కరుప్పు’ చిత్రంలో త్రిష కనిపించారు.

Tags: Is Trisha entering politics?