మదనపల్లె ముచ్చట్లు:
బెంగళూరు రోడ్డు నక్కలదిన్నె తండాలోని ఓ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చోరీకి ఏటిఎంలో చోరికి విఫలంగా యత్నించారు. మేకులు, గుణపాలతో ఏటీఎంను ధ్వంసం చేస్తుండగా స్థానికులు వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి గస్తీ, స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి రావడంతో దొంగలు పోలీసులను చూసి పారిపోయారు. ఏటీఎం పాక్షికంగా దెబ్బతినగా, నగదు భద్రంగా ఉన్నట్లు తెలిసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పదేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఎస్బిఐ ఏటీఎం పగలగొట్టి లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన మళ్లీ చర్చనీయాంశమైంది. మదనపల్లెలో ఏటిఎంల చోరీ కేసులో ఇది మూడవది కావడం విశేషం.
Tags; Failed attempt to rob an ATM in Madanapalle