అమరావతిముచ్చట్లు:
బంగారం ధరలు భారీగా తగ్గడంతో గోల్డ్ లోన్ తీసుకున్నవారికి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. గత 11 నెలల్లో పసిడి ధర 10 గ్రాములకు సుమారు రూ.60 వేల వరకు తగ్గినట్లు సమాచారం.
ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1.25 లక్షల వద్ద ఉండటంతో బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. బంగారం విలువ తగ్గడంతో రుణాలకు భద్రత తగ్గుతుందని భావిస్తున్న బ్యాంకులు, రుణగ్రహీతలకు మార్జిన్ కాల్స్ జారీ చేస్తున్నాయి.
దీంతో అదనంగా మరికొంత బంగారాన్ని తాకట్టు పెట్టాలని లేదా కొంత నగదును వెంటనే జమ చేయాలని సూచిస్తున్నాయి. లేనిపక్షంలో రుణాల వసూళ్ల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.
బంగారం ధరలు మరింత తగ్గితే బ్యాంకులపై రిస్క్ పెరిగే అవకాశం ఉంది. వేలం ద్వారా బంగారాన్ని విక్రయించినా ఇచ్చిన రుణం పూర్తిగా వసూలవుతుందా లేదా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Tags; Drop in gold prices… Banks deal a shock to those who have taken gold loans!