అమరావతిముచ్చట్లు:
ఏపీలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ మొత్తాన్ని గడువు కంటే ఒక రోజు ముందే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రక్రియను నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో పూర్తి చేయనున్నారు.
పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.2,774 కోట్ల నిధులను విడుదల చేసింది.
సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన జరిగే ఈ పంపిణీని ఈసారి ప్రభుత్వం ముందుగానే చేపట్టడం గమనార్హం.
Tags:Sarpanch elections: Pensions distributed early in AP.