November 22, 2026
Explore
మైదానంలో ఆడుకుంటూ కుప్పకూలి విద్యార్థి మృతి

మైదానంలో ఆడుకుంటూ కుప్పకూలి విద్యార్థి మృతి

November 22, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లె పట్టణంలో ఆదివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మైదానంలో ఆడుకుంటుండగా కుప్పకూలిన విద్యార్థి మృతి చెందడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
శివనగర్‌లో నివాసం ఉంటున్న ఎక్సైజ్ ఎస్సై గుర్రంకొండ శ్రీనివాసులు కుమారుడు జస్వంత్ (17) స్థానిక జీఆర్‌టీ గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags; Student collapses and dies while playing on the playground