November 22, 2026
Explore
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి.

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి.

November 22, 2026 | Andhra Pradesh

కర్నూలు ముచ్చట్లు:

  • మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన … కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
  • గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా ఆదివారం బొమ్మిరెడ్డిపల్లి, వెల్దుర్తి, చెరుకులపాడు, కృష్ణగిరిలలోని నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో అనవసర వ్యక్తుల సంచారాన్ని నియంత్రించాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.ఎస్పీ తో పాటు పత్తికొండ డిఎస్పీ వంశీధర్ గౌడ్, సీఐలు రామయ్య నాయుడు, యుగంధర్, మహమ్మద్ గౌస్, చిరంజీవి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ఎస్ఐలు ఉన్నారు.

Tags: Tight security arrangements should be put in place at the nomination centers.