అమరావతిముచ్చట్లు:
▪️పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం.
▪️నోటిఫికేషన్లోని క్లాజ్ 33(9) చెల్లదంటూ తీర్పు.
పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ నోటిఫికేషన్లో మిగిలిపోయిన 400 ఖాళీలను (లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ) తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ నియామక బోర్డు లను ఆదేశించింది. ఈ ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని తేల్చిచెప్పింది. ప్రొవిజినల్ జాబితాను ఎట్టి పరిస్థితుల్లో సమీక్షించబోమని, వెయిటింగ్ లిస్ట్ ఉండదని, మిగిలిపోయిన ఖాళీలు రద్దవుతాయంటూ నోటిఫికేషన్లో పేర్కొన్న క్లాజ్ 33(9) చెల్లదని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ఎన్.విజయ్ ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.
Tags: The remaining 400 Constable posts from 2022 must be filled based on the subsequent merit list.