రాయచోటి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం – రాయచోటి మార్గంలో ఉన్న బండ్లపల్లె టోల్ ప్లాజా వద్ద ఆదివారం వేకువ జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ గుర్తు తెలియని యువకుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. వారు క్షతగాత్రుడిని చికిత్సల నిమిత్తం అంబులెన్స్‌లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన యువకుడి వివరాలపై పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Tags: Road accident at toll plaza early in the morning; young man sustains severe injuries