పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని కపాడంమిట్టపల్లె రైతుసేవా కేంద్రంలో మామిడి రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఉధ్యానవనశాస్త్రవేత్త డాక్టర్ దత్తారెడ్డి , హార్ట్కల్చర్ ఆఫీసర్ వరప్రసాద్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తారెడ్డి మాట్లాడుతూ మామిడి పూత ప్రారంభం ముందే మల్టీకే , బోరాన్ లు నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. అలాగే అంతరపంటగా ఖోఖో పంట వేసుకోవాలన్నారు. కాలిప్లవర్ పంటలో మామిడి పండ్లకు కట్టే కవర్ల లాగా కాలిప్లవర్లకు కూడ కవర్లు వినియోగించుకుని పంటలను రోగాల భారీ నుంచి కాపాడుకోవచ్చునన్నారు.
Tags; Training for farmers