November 19, 2026
Explore
సెక్యూరిటీ / విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ

సెక్యూరిటీ / విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ

November 19, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

టీటీడీ విజిలెన్స్ విభాగంలోని సెక్యూరిటీ / విజిలెన్స్ గార్డు పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి మాజీ సైనికులు, పౌరుల మధ్య అమలులో ఉన్న 1:2 నిష్పత్తిని రద్దు చేస్తూ టీటీడీ సాధికార మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ స్పష్టం చేసింది.

ఈ నిష్పత్తిని మార్చి కొత్త విధానంలో నియామకాలు చేపట్టే అంశం కేవలం ప్రతిపాదన దశలోనే ఉందని, దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలియజేసింది.

గతంలో అమలులో ఉన్న నియామక విధానమే ప్రస్తుతం కూడా యథాతథంగా కొనసాగుతోందని, నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.

కావున, ఈ అంశంపై ఎలాంటి అపోహలకు తావివ్వకుండా, అసత్య ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Tags; No changes have been made to the recruitment rules for security/vigilance guards: TTD