November 19, 2026
Explore
న‌వంబరు 24న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం

న‌వంబరు 24న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం

November 19, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

     తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో న‌వంబరు 24న‌ కార్తీక దీపోత్సవం ఘ‌నంగా జరుగ‌నుంది. సాయంత్రం 6.30 గంట‌ల‌కు శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి కార్తీక దీపం, వ‌స్త్రాల‌ను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి సమర్పిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించ‌నున్నారు.

శ్రీ కోదండరామాలయంలో

      తిరుప‌తి శ్రీ కోదండరామాలయంలో న‌వంబరు 24న‌ సాయంత్రం కార్తీక దీపోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా రాత్రి 8 గంట‌ల‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకువ‌చ్చి కార్తీక దీపాలు వెలిగిస్తారు.


Tags: Karthika Deepotsavam at Sri Govindaraja Swamy Temple on November 24