తిరుపతి ముచ్చట్లు:
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నారు. టీటీడీ విద్యాసంస్థలతో పాటు తిరుపతి జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు.
భగవద్గీతలోని 6వ అధ్యాయం ధ్యానయోగంపై 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు, 18వ అధ్యాయం మోక్ష సన్యాసయోగం పై 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.
ఆసక్తి గల విద్యార్థులు డిసెంబరు 13వ తేదీ ఉదయం 9 గంటలకు అన్నమాచార్య కళామందిరానికి హాజరుకావాలి. మరిన్ని వివరాలకు 9676615643, 8500049345 నంబర్లలో సంప్రదించవచ్చు.
అలాగే, ఆయా పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలల్లో పోటీలు నిర్వహించి, ఒక్కొక్క విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థుల వివరాలను డిసెంబరు 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అన్నమాచార్య కళామందిరంలోని ప్రోగ్రాం అసిస్టెంట్‌కు లేదా హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యాలయంలో సంబంధిత విభాగానికి అందజేయాలి. వివరాలను hdpp.prints@gmail.com కు కూడా పంపవచ్చు.
ఈ పోటీల్లో విజేతలకు డిసెంబరు 20వ తేదీన గీతా జయంతి సందర్భంగా సాయంత్రం 5 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో బహుమతులు ప్రదానం చేస్తారు.
Tags; Bhagavad Gita recitation competitions to be held at Annamacharya Kalamandiram on December 13