November 19, 2026
Explore
5 ప్రాంతాలకు చేరువలో ‘అక్వాన్’ తుఫాన్.. 110 కి.మీ వేగంతో గాలులు

5 ప్రాంతాలకు చేరువలో ‘అక్వాన్’ తుఫాన్.. 110 కి.మీ వేగంతో గాలులు

November 19, 2026 | Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ‘అక్వాన్’ క్రమంగా తీర ప్రాంతాల వైపు కదులుతోంది. గత 6 గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) వెల్లడించింది. రేపు మధ్యాహ్నానికి నరసాపురం-పూరీ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 110 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ తుఫాన్ నరసాపురానికి 470 కి.మీ, కళింగపట్నానికి 490 కి.మీ, చెన్నైకి 570 కి.మీ, గోపాల్‌పూర్‌కు 580 కి.మీ, పూరీకి 640 కి.మీ దూరంలో ఉన్నట్లు పేర్కొంది.

Tags: Cyclone ‘Akwan’ nears 5 regions; winds blowing at 110 km/h