November 17, 2026
Explore
సీసీ కెమెరాలో రికార్డైన ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి!

సీసీ కెమెరాలో రికార్డైన ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి!

November 17, 2026 | Andhra Pradesh

జగిత్యాలముచ్చట్లు:

జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై విషాద ఘటన చోటుచేసుకుంది. మల్యాల ఎక్స్‌రోడ్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి చెందిన చుంచుల మల్లయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.

మల్లయ్య రోడ్డుపక్కన తన బైక్ నిలిపి ఎదురుగా ఉన్న సూపర్ మార్కెట్‌కు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags; Horrific road accident captured on CCTV; elderly man dies!