November 17, 2026
Explore
రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి

రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి

November 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ప్రస్తుతం ఎలినినో కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోతోందని , ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలను మాత్రమే పండించుకోవాలని ఏడి శివకుమార్‌ సూచించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాబోయే రబి సీజన్‌లో ఎలినినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. రైతులు రాగి, వేరుశెనగ, కూరగాయలు, పశుగ్రాస పంటలు మాత్రమే పండించుకోవాలన్నారు. వరి పంట వేయరాదని సూచించారు. నీటి వినియోగం తక్కువ ఉన్న పంటలతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉండదన్నారు. రైతులకు ముందస్తుగా సూచనలు చేయడం జరుగుతుందన్నారు. పరిస్థితులను రైతులు అవగాహన చేసుకుని , పంటలు పండించుకోవాలని , అవసరమైన సలహాలు, సూచనలకు ఆర్‌ఎస్‌కెలను సంప్రదించాలని కోరారు.

Tags:Farmers should cultivate crops that require limited irrigation.