పుంగనూరుముచ్చట్లు:
ప్రభుత్వాదేశాల మేరకు ఈనెల 20వ తేదీన ఏపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. స్థానిక ఎంసివి డిగ్రీ కళాశాలలో 12 ప్రముఖ కంపెనీలచే 485 ఉద్యోగ నియామకాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతి, యువకులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రూ.12 వేల నుంచి రూ.35 వేల వరకు జీతాలు అందించనున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు తమ విద్యార్హత , తదితర రికార్డులు, పాస్‌పోర్టు ఫోటోలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని పేర్కొన్నారు.
Tags: Job Mela on the 20th