అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో ప్రజలకు మెరుగైన, సమగ్ర డిజిటల్ ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రాజెక్ట్ సంజీవని అమలుకు జిల్లా స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
మదనపల్లె జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం కమిటీ సభ్యులతో సమావేశమైన కలెక్టర్, ప్రాజెక్టు అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం, డిజిటల్ ఆరోగ్య సేవల అనుసంధానంపై సమీక్షించారు.
ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత సులభంగా, సమర్థవంతంగా అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మౌలిక, సాంకేతిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
Tags; District-level coordination committee for the implementation of Project Sanjeevani