November 16, 2026
Explore
కదులుతున్న రైలు నుంచి సముద్రంలోకి దూకిన మహిళ..

కదులుతున్న రైలు నుంచి సముద్రంలోకి దూకిన మహిళ..

November 16, 2026 | Andhra Pradesh

తమిళనాడుముచ్చట్లు:


గంటల వ్యవధిలోనే రెండో ఘటన.. కొత్త పాంబన్ వంతెనపై కలకలం!

తమిళనాడులోని కొత్త పాంబన్ రైల్వే వంతెనపై వరుసగా రెండు ఆందోళనకర ఘటనలు చోటుచేసుకున్నాయి. కదులుతున్న రైళ్ల నుంచి ఇద్దరు ప్రయాణికులు సముద్రంలోకి దూకడం కలకలం రేపింది.

శనివారం రాత్రి రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు సముద్రంలోకి దూకగా, ఆదివారం ముల్లిమునై దీవి సమీపంలో అతడి మృతదేహం లభ్యమైంది.

మరోవైపు ఆదివారం ఓ మహిళా ప్రయాణికురాలు కదులుతున్న రైలు నుంచి సముద్రంలోకి దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిన ఈ రెండు ఘటనలు ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.

Tags: A woman jumped from a moving train into the sea..