November 16, 2026
Explore
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడిన అల్పపీడనం..

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడిన అల్పపీడనం..

November 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


నేడు తుఫానుగా.. రేపు తీవ్ర తుఫానుగా మారే అవకాశం!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. గత ఆరు గంటల్లో గంటకు 8 కి.మీ. వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ తీవ్రతను సంతరించుకుందని తెలిపింది. నవంబర్ 15 అర్ధరాత్రి 11:30 గంటల సమయానికి విశాఖపట్నానికి 870 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది.

ఈ తీవ్ర వాయుగుండం నవంబర్ 16 సాయంత్రానికి తుఫానుగా, నవంబర్ 17 సాయంత్రానికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. అనంతరం మరింత బలపడి వాయువ్య దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

Tags; Low-pressure area in the Bay of Bengal intensifies into a deep depression..