ఏప్రిల్ 2026 నుండి 125 రోజుల పని దినాల కల్పన…..
మదనపల్లి ముచ్చట్లు:
వికసిత్ భారత్ జి రామ్ జి పతకంపై 125 రోజుల ఉపాధి హామీ గోడపత్రికను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం ఉదయం పి జి ఆర్ ఎస్ హాల్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్భారత్ జి రామ్ జి పథక అమలు తో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయాన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 01 నుంచి విబిజి రామ్ జి అమలు చేస్తుందన్నారు. ప్రస్తుతం జరుతున్న ఉపాధి పనులను ఇంకా పారదర్శకంగా నిర్వహించడం తో పాటు ఉపాధి వేతనదారులకు 125 రోజులు పని కల్పించడం జరుతుందని, రైతుల కు వ్యవసాయ పనుల సమయం లో కూలీల కొరత లేకుండా ఉండేందుకు గాను 60 రోజులు ఉపాధి విరామం ప్రకటించడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో సుస్థిర అభివృద్ధి కి అవసరం అయిన రోడ్లు, కాల్వలు పనులను, రైతులకు ఉపయోగపడే భూమి అభివృద్ధి పనులు, పండ్ల తోటల పనులు ఈ కార్యక్రమం ద్వారా అమలు జరుగుతాయని తెలిపారు. ఈ పథకానికి గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని అందుకు గాను మార్చి నెల అఖరు వరకు గ్రామాలలో ప్రచార కార్యక్రమాలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కళ్యాణి, డిఆర్ఓ మధుసూదన్ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
Tags: District Collector Nishant Kumar unveiled a wall poster of “125 days employment guarantee” on the Vikasit Bharat-G-Ram-G scheme…