March 30, 2026
Explore
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోతే చర్యలు

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోతే చర్యలు

March 30, 2026 | Uncategorized

సీఐ సుబ్బరాయుడు

పుంగనూరుముచ్చట్లు:

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని సీఐ సుబ్బరాయుడు వాహనచోదకులను హెచ్చరించారు. సోమవారం ఆయన పట్టణంలోని ఎంబిటి రోడ్డు, సెంటర్‌లాడ్జి, తూర్పువెహోగసాల, మదనపల్లె రోడ్డుతో పాటు వివిధ కూడలి ప్రాంతాలలో ఆటోడ్రైవర్లకు, ద్విచక్రవాహనదారులకు ట్రాఫిక్‌ నిబంధనలను తప్పకుండ పాటించాలని , ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెంట్‌ ధరించాలన్నారు. వాహనాల రికార్డులను, లైసెన్సులను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్‌బెల్టు ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని రికార్డులను కలిగి ఉండాలని , ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తిస్తూ ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండ వాహనదారులకు, పాదాచారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండ నడుచుకోవాలన్నారు. ఎవరైనా ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

Tags: Action will be taken for failure to follow traffic rules.