November 12, 2026
Explore
తుఫాన్ ద్వారా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం: మంత్రి గొట్టిపాటి

తుఫాన్ ద్వారా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం: మంత్రి గొట్టిపాటి

November 12, 2026 | Andhra Pradesh

ప్రకాశంముచ్చట్లు:

ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మురసు తుఫాన్ ప్రభావంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

విద్యుత్, వ్యవసాయ, ఉ ద్యానవన శాఖ, ఆర్ అండ్ బీ అధికారులతో.. మురసు తుఫాన్ ద్వారా జరిగిన
నష్టం, అనంతర పరిణామాలపై చర్చించారు.

తుఫాన్తో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనుల పురోగతిపై ఆరా తీశారు. గృహ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ దాదాపు పూర్తి అయిందని మంత్రికి అధికారులు తెలిపారు.

నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ లైన్ల మరమ్మతులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి దిశానిర్దేశం చేశారు.

విద్యుత్ సరఫరా లేక, సాగునీరు అందక ఏ ఒక్క రైతు పంట కూడా దెబ్బతినకుండా చూడాలని అధికారులకు సూచించారు. పంటల వారీగా నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.

నష్టం జరిగిన వరి, పత్తి, మిరప, మినుము, శనగ, పొగాకు తదితర పంటల విస్తీర్ణంతో పాటు నష్టపోయిన రైతులందరి వివరాలను నమోదు చేయాలని నిర్దేశించారు.

అధికారులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించి అంచనాలను సిద్ధం చేయాలని ఆజ్ఞాపించారు.

Tags: Government aid for every farmer who suffered losses due to the cyclone: ​​Minister Gottipati