November 12, 2026
Explore
ఏకగ్రీవంగా సర్పంచ్‌గా అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ.1.50 కోట్లు విరాళం!

ఏకగ్రీవంగా సర్పంచ్‌గా అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ.1.50 కోట్లు విరాళం!

November 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దుళ్ళ మాజీ సర్పంచ్ డీఎన్‌ఆర్ కుమార్తె విశ్వశ్రీ ప్రియ ప్రకటన

కడియం:-

గ్రామ సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధి కోసం తన వంతుగా రూ.1.50 కోట్లు విరాళంగా అందిస్తానని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దూడల నాగేశ్వరరావు కుమార్తె, ఎంబీబీఎస్ విద్యార్థిని విశ్వశ్రీ ప్రియ ప్రకటించారు.

ఇటీవల దుళ్ళ గ్రామ మాజీ ఉపసర్పంచ్ తోకల శ్రీనివాస్ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి రూ.కోటి విరాళంగా ఇస్తానని చేసిన ప్రకటనపై ఆమె స్పందించారు.

తన తండ్రి దివంగత దూడల నాగేశ్వరరావు, తల్లి రత్నం గతంలో గ్రామ సర్పంచ్‌లుగా పనిచేసి గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని విశ్వశ్రీ ప్రియ తెలిపారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ గ్రామానికి సేవ చేయాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.

మరో ఏడాదిలో తన ఎంబీబీఎస్ విద్య పూర్తవుతుందని, గ్రామ ప్రజలు తనకు సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. తనను సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే గ్రామాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.1.50 కోట్లు విరాళంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

Tags: If elected unanimously as Sarpanch, I will donate Rs. 1.50 crore for the village’s development!