November 11, 2026
Explore
వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు

వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు

November 11, 2026 | Andhra Pradesh

విశాఖపట్టణం ముచ్చట్లు:


సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా నోవోటెల్ హోటల్లో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు

  • విశాఖలో సీఎం చంద్రబాబుతో భేటి అయిన యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ అల్ తౌక్ మర్రి
  • ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు సహా వివిధ రంగాల్లో పెట్టుబడులపై చర్చ.
  • ప్రముఖ అగ్రిఫుడ్ కంపెనీ సిలాల్ సంస్థను ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి.
  • ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి మంచి విజన్ ఉన్న నాయకుడు ఉన్నారని ప్రశంసించిన యూఏఈ బృందం.
  • బ్లూ చిప్ కంపెనీలు, డేటా సెంటర్లు ఏపీకి రావటం శుభపరిణామమన్న యూఏఈ మంత్రి.
  • ఏపీ నుంచి రొయ్యలు దిగుమతి చేసుకుంటామని తెలిపిన యూఏఈ బృందం.
  • ఫుడ్ క్లస్టర్‌లో భాగంగా 12 యూఏఈ సంస్థలు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడి.
  • ఏపీ యూఏఈ మధ్య మంచి భాగస్వామ్యాలు ఏర్పాటు కావాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • త్వరలోనే ఏపీలో క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ప్రారంభించనున్నట్టు యూఏఈ బృందానికి తెలిపిన సీఎం చంద్రబాబు.
  • పుట్టపర్తికి సమీపంలో 5వ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ చేపడుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడి.
  • సెమీ కండక్టర్ల కంపెనీల కోసం అవసరమైన భూ కేటాయింపులు జరపనున్నట్టు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి.
  • కేంద్ర ప్రభుత్వం కూడా సెమీ కండక్టర్ల తయారీకి సహకారం అందిస్తోందని వివరించిన సీఎం.
  • పంటలకు, కంపెనీలకు ఇబ్బంది లేకుండా నీరు సరఫరాకు చర్యలు తీసుకుంటన్నట్టు యూఏఈ బృందానికి వివరించిన ముఖ్యమంత్రి.
  • గోదావరి-కావేరి అనుసంధానానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పిన సీఎం చంద్రబాబు.
  • గ్రావిటీ కెనాల్స్ ద్వారా విశాఖకు, అమరావతికి నీటిని తీసుకెళ్తున్నట్టు వెల్లడి
  • అనంతపురంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటులో యూఏఈ కంపెనీలు ముందుకు రావాలని ఆహ్వానించిన ముఖ్యమంత్రి.
  • ఏపీలో మారిటైమ్ కార్గో అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరుతున్నానని కోరిన సీఎం
  • ఆర్టీఐహెచ్ ద్వారా వివిధ రంగాల్లో ఆవిష్కరణలపై పనిచేస్తున్నామని.. ఇందులో భాగస్వామ్యం కావాలని కోరిన సీఎం.
  • పౌరసేవల్లో, పాలనలోనూ ఏఐ స్టాక్ ద్వారా పనిచేస్తున్నట్టు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి.

Tags;Chief Minister holds a series of meetings with representatives from various countries