అమరావతిముచ్చట్లు:
ఏపీలో పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ షాపుల ద్వారా కందిపప్పును కిలో రూ.100కు, గోధుమ పిండిని రూ.25కు, పామాయిల్ లీటరును రూ.125కు అందించాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు, మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల రాయితీ కోసం రూ.300.60 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ చర్య ద్వారా ప్రజలపై ధరల భారాన్ని తగ్గించి, రాయితీ ధరలకే నాణ్యమైన సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం
లక్ష్యంగా పెట్టుకుంది.
Tags;Pigeon peas (toor dal), wheat flour, and palm oil are available at lower prices in ration shops.