November 11, 2026
Explore
సెలవుపై ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

సెలవుపై ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

November 11, 2026 | Andhra Pradesh

యాదాద్రి ముచ్చట్లు:

యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపూర్‌కు చెందిన పల్లపు మహేందర్ (26) ఐదేళ్లుగా ఆర్మీలో జవాన్‌గా సేవలందిస్తున్నాడు. దసరా పండుగ కోసం 25 రోజుల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు.

సోమవారం వ్యక్తిగత పని ముగించుకుని బుల్లెట్‌పై తిరిగి వెళ్తుండగా, సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో బైక్‌పై ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రామలింగం (26) కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, రామలింగం చికిత్స పొందుతున్నాడు. మహేందర్ మృతితో కొండాపూర్‌లో విషాదం నెలకొంది.

Tags;Army jawan, home on leave, dies in a road accident