November 11, 2026
Explore
కొండగట్టులో భక్తులకు చెక్క విగ్రహంతో ఆంజన్న దర్శనం

కొండగట్టులో భక్తులకు చెక్క విగ్రహంతో ఆంజన్న దర్శనం

November 11, 2026 | Andhra Pradesh

కొండగట్టు ముచ్చట్లు:

కొండగట్టులో ఆంజన్న దర్శనానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. గర్భాలయంలో ఉన్న మూలవిరాట్‌పై చందనం తొలగించే సమయంలో వాహన పూజలు మినహా అన్ని ఆర్జిత సేవలను 5 రోజుల పాటు నిలిపివేయనున్నారు.

ఆ సమయంలో స్వామివారి దైవ దర్శనం కూడా నిలిపివేయనున్నారు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో చెక్కతో తయారు చేయించిన స్వామివారి ఉత్సవమూర్తిని ప్రతిష్టించి దర్శనం కల్పించనున్నారు. ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:At Kondagattu, devotees get to see Anjaneya (Hanuman) in the form of a wooden idol.