తిరుపతి ముచ్చట్లు:
గణపతి హోమంతో శ్రీకారం.. కార్తీక మాసమంతా ప్రత్యేక హోమాలు
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న నెల రోజుల విశేషపూజ హోమ మహోత్సవాలు బుధవారం గణపతి హోమంతో భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఉదయం పంచమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూతితో విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు.
సాయంత్రం గణపతి పూజ, పుణ్యాహవచనం, వాస్తు పూజ, పర్యగ్నీకరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ అనంతరం గణపతి హోమం, లఘుపూర్ణాహుతి శాస్త్రోక్తంగా నిర్వహించారు. విఘ్నవినాయకుని అనుగ్రహంతో విఘ్నాలు తొలగి, కార్యసిద్ధి కలగాలని ఈ హోమం నిర్వహించడం విశేషం.
నవంబరు 12 నుంచి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం
విశేషపూజ హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 12, 13 తేదీలలో సుబ్రహ్మణ్యస్వామివారి హోమం వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో కుమారి దేవి, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags: Special rituals and homa ceremonies commence with great grandeur at the Sri Kapileswara Temple