మదనపల్లి ముచ్చట్లు:
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు గ్రామాల్లో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.
గ్రామాల్లో నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడే అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. సమస్యలు ఎదురైతే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం అందించాలని కోరారు.
Tags:Police hold ‘village sleepovers’ (palle nidra) in villages