అన్నమయ్య ముచ్చట్లు:
అన్నమయ్య విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు రాయచోటి, మదనపల్లె పట్టణాల్లోని పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు. డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపడుతూ, శక్తి టీమ్స్ ద్వారా గస్తీని ముమ్మరం చేశారు.
పాఠశాలలు, కళాశాలల ప్రారంభ, ముగింపు సమయాల్లో ఆకతాయిలు, ఈవ్‌టీజర్ల వేధింపులను అరికట్టేందుకు అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.
విద్యార్థినులను వేధించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100 లేదా 112కు ఫోన్ చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.
Tags: Drone surveillance for the safety of female students – Police intensify patrols with ‘Shakti’ teams!