November 11, 2026
Explore
ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

November 11, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లాముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మదనపల్లెలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి అదనపు ఎస్పీ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ విద్యారంగ అభివృద్ధికి ఆజాద్ చేసిన కృషిని కొనియాడారు. ఐఐటీలు, యూజీసీ వంటి విద్యాసంస్థల ఏర్పాటుకు ఆయన అందించిన సేవలను గుర్తుచేశారు.

భారత స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిన ఆజాద్, దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న గ్రహీతగా నిలిచారని తెలిపారు. ఆయన జీవితం, ఆశయాలు, ఆదర్శాలు నేటి తరానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Tags: Maulana Abul Kalam Azad’s birth anniversary celebrated in a grand manner