November 11, 2026
Explore
ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించాలి

ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించాలి

November 11, 2026 | Andhra Pradesh

అన్నమయ్యముచ్చట్లు:

డీఈఓకు ఎస్టీయూ నాయకుల వినతి

అన్నమయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నుంచి 55 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులు, గర్భిణులు, చంటిపిల్లల తల్లులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు మినహాయింపు కల్పించాలని ఎస్టీయూ అన్నమయ్య జిల్లా నాయకత్వం కోరింది. ఈ మేరకు మదనపల్లిలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. సుబ్రహ్మణ్యంను కలిసి జిల్లా అధ్యక్షుడు అంకం శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్ వినతిపత్రం అందజేశారు.

మహిళా ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు ఎన్నికల విధులకు కేటాయించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఉపాధ్యాయులకు వీలైనంత వరకు సమీప మండలాల్లోనే విధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు.

Tags: Exemption from election duties should be granted.