పంజాబ్ ముచ్చట్లు:
కొడుకు పుట్టాలని కోరుకున్న పంజాబ్ కార్పెంటర్ యుధ్వీర్ సింగ్ను కూతురి రూపంలో అదృష్టం వరించింది. చిన్నారి పుట్టిన మరుసటి రోజే రాష్ట్ర లాటరీలో రూ.1.5 కోట్ల మొదటి బహుమతి గెలుచుకున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్ 4న టికెట్ కొనగా, 6న ఈ అదృష్టం తలపు తట్టింది. తనకు సిరిసంపదలు తెచ్చిపెట్టిన ఆ కూతురికి ‘బర్కత్’ (సంపద) అని నామకరణం చేసినట్లు యుధ్వీర్ ఆనందంగా వెల్లడించారు.
Tags; Daughter brought the luck… Rs 1.5 crore won in a lottery